స్టార్ మా లో పూజా బేబీ సందడి

స్టార్ మా లో పూజా బేబీ సందడి

స్టార్ మా నిర్వహిస్తున్న సూపర్ సింగర్స్ కార్యక్రమంలో ఓ అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది.  ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఈ ఏడాదితో పదో సీజన్లోకి అడుగుపెటింది.  ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్ మర్చి 23 వ తేదీన ప్రసారం అయింది.  కొత్త సింగర్స్ ను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ షో ను నిర్వహిస్తున్నారు.  రఘు కుంచె, కల్పన, ఉషలు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.  

కాగా రీసెంట్ గా ఈ కార్యక్రమంలోకి మహర్షి టీమ్ ఎంట్రీ ఇచ్చింది.  హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు వంశి పైడిపల్లిలు హాజరయ్యారు.  థమన్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.  పూజా హెగ్డే ఈ కార్యక్రమంలో అదరగొట్టింది.  సింగర్, యాంకర్ రేవంత్ మహర్షిలోని సాంగ్ ను పాడగా... పూజా హెగ్డే చాలా బాగుంది అంటూ కంప్లిమెంట్ ఇచ్చింది.