అందరి కళ్ళు జిగేల్ రాణి మీదే..!!

అందరి కళ్ళు జిగేల్ రాణి మీదే..!!

పూజా హెగ్డే గురించి చెప్పాలి అంటే డీజే సినిమాకు ముందు డీజే తరువాత అని చెప్పాలి.  డీజే కు ముందు సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు.  డీజే తరువాత ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి.  అరవింద సమేత సినిమాతో తిరిగి లైన్లోకి వచ్చింది.  ఆ తరువాత చేసిన మహర్షి బంపర్ హిట్.  ఇప్పుడు వాల్మీకి చేస్తున్నది. అలానే అల్లు అర్జున్ తో అల వైకుంఠపురం సినిమా చేస్తున్నది.  ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  

దీంతో పాటు ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నారు.  అటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్లో సినిమాలు చేస్తూ తీరికలేకుండా బిజీ అయ్యింది పూజా.  ఇక ఆదివారం సాయంత్రం జరిగిన సినిమహోత్సవం కార్యక్రమంలో పూజా హెగ్డే స్టెప్పులతో అదరగొట్టింది.  వయలెట్ కలర్ జిగేల్ మనిపించే డ్రెస్లో వావ్ అనిపించే విధంగా డ్యాన్స్ చేసింది. అసలే టాప్ హీరోయిన్.. పైగా టాప్ లేచిపోయే సాంగ్ కు డ్యాన్స్.. ఇంకేముంది.. ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా పూజా డ్యాన్స్ కు ఫిదా అయ్యారు.