తార‌క్‌ని టీజ్ చేస్తున్న హాటీ

తార‌క్‌ని టీజ్ చేస్తున్న హాటీ

ముంబై బ్యూటీ పూజా హెగ్డే ఏం చేసినా అదో కవ్వింత‌.. తుళ్లింత‌! ఇదివ‌ర‌కూ డీజే చిత్రంలో 30 సెక‌న్ల పాటు బికినీలో వేడెక్కించింది. బ్రాహ్మ‌ణుడైన దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ అడ్డంగా బుక్క‌యిపోయాడు. బ‌న్ని ఒక్క‌డికేనా ఈ స‌న్నివేశం అంటే మునుముందు తార‌క్‌కి త‌ప్పేట్టు లేదు.

ప్ర‌స్తుతం ఈ భామ ఎన్టీఆర్ స‌ర‌స‌న త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `అర‌వింద స‌మేత‌` చిత్రంలో ఆడిపాడుతోంది. తాజా షెడ్యూల్‌లో పూజా పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఆ క్ర‌మంలోనే ఈ భామ ట్విట్ట‌ర్‌లో తార‌క్‌ని టీజ్ చేస్తూ.. ఈసారికి మిస్స‌య్యాను.. అంటూ క‌వ్వించింది. నెక్ట్స్ టైమ్ క‌లుస్తామేమో!! అని ఈమోజీతో ఉడికించింది. మొత్తానికి తార‌క్‌తో క‌లిసి స‌న్నివేశాల్లో న‌టించాల‌న్న ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌తిరోజు ఇలా సెట్స్‌కి రావ‌డాన్ని ఎంతో ఆహ్లాదంగా భావిస్తున్నా. త‌ర‌వాతి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని ట్వీట్ చేసింది.