మెగాహీరోతో రొమాన్స్‌ చేయనున్న పుట్టబొమ్మ..!

మెగాహీరోతో రొమాన్స్‌ చేయనున్న పుట్టబొమ్మ..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ చిరంజీవికి జోడీగా నటిస్తుంది.  ఆచార్యలో దేవాలయాల పేరుతో జరుగుతున్న అవకతవకలపై పోరాటం చేసే ఎండోమెంట్‌ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా చిరు కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక రాంచరణ్‌ నక్సలైట్‌గా కనిపించనున్నాడు.   అయితే.. తాజాగా మరో వార్త ఈ సినిమా నుంచి వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో పుట్ట బొమ్మ పూజా హెగ్డే సందడి చేయనుందని టాక్‌. ఓ ప్రత్యేక పాత్రలో ఆమె ఈ సినిమాలో అలరించనుందట. అది కూడా చెర్రీ కి లవర్‌గా మెరవనుందని సమాచారం. ఈ మేరకు ఈ ముద్దుగుమ్మ ను సంప్రదించారట. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా భారీ అంచనాలు పెరుగుతున్నాయి. కాగా... పూజా హెగ్డే "అల వైకుంఠపురం లో" మూవీతో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. అంతేకాదు... టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ టాప్‌లోనూ నిలిచింది.