పూజ కూల్ ఎక్స్ ప్రెషన్స్

పూజ కూల్ ఎక్స్ ప్రెషన్స్

పూజా హెగ్డే... పరిచయం అక్కర్లేని పేరు.  బన్నీతో చేసిన డిజె సినిమా తరువాత వరస అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతున్నది.  అరవింద సమేత బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బ్యాక్ టు బ్యాక్ గా వచ్చిన మహర్షి కూడా విజయం సాధించింది.  ఈ సినిమాతో పాటు అటు ప్రభాస్ 20 వ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.  

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే... అల్లు అర్జున్... త్రివిక్రమ్ సినిమాలో మరో ఛాన్స్ దక్కించుకుంది కన్నడ బ్యూటీ.  వీటితో పాటు మరో మూడు భారీ చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తుంది.  మరో ఐదేళ్లపాటు కెరీర్లో క్షణం తీరిక లేకుండా ఉండేవిధంగా ప్లాన్ చేసుకున్నది పూజ.  సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం తనదైన స్టైల్ లో ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఎట్రాక్ట్ చేస్తోంది.  రీసెంట్ గా పూజ చేసిన పోస్ట్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.