పూజా... మరీ ఇంతలా...!!?

పూజా... మరీ ఇంతలా...!!?

అందం ఉంటేనే గ్లామర్ ఫీల్డ్ లో నిలబడగలుగుతారు.  టాలెంట్ ఉండాలి.  దాని తోడుగా అందం కూడా ఉండాలి.  ఒక్కోసారి ఈ అందమే వాళ్ళను నిలబెడుతుంది.  హోమ్లీగా, పక్కింటి అమ్మాయిలా టాలీవుడ్ కు పరిచయమైన మంగళూరు బ్యూటీ పూజా హెగ్డే స్టార్టింగ్ లో చాలా కష్టపడింది.  అవకాశాలు వచ్చినా పెద్దగా లాభం లేకపోయింది.  అల్లు అర్జున్ తో చేసిన డీజే సినిమాతో పూజా దశ తిరిగింది.  

డీజేలో బికినీతో మతిపోగోట్టిన ఈ బ్యూటీ, వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది.  బాహుబలిలో జిల్ జిల్ జిగేలు రాణి అంటూ ఆడిపాడి అదరగొట్టింది.  అరవింద సమేత సినిమాతో హిట్ కొట్టిన పూజా, మహేష్ తో మహర్షి చేస్తోంది. బాహుబలి హీరో ప్రభాస్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  వీటితో పాటు తన కెరీర్ను మలుపు తిప్పిన హీరో అల్లు అర్జున్ తో మరో సినిమాకు సైన్ చేసింది.  త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 24 వ తేదీన షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.  

ఇదిలా ఉంటె, డీజే తరువాత అందాల ఆరబోతకు అడ్డు చెప్పని పూజా... మాములుగా బయటకూడా చాలా హాట్ హాట్ డ్రెస్ లతో మతిపోగోడుతుంటుంది.  ఇక స్పెషల్ గా ఈవెంట్స్ కు హాజరయ్యేటప్పుడు మరింత గ్లామర్ గా కనిపించే విధంగా డ్రెస్ లతో వాలిపోతుంది.  రీసెంట్ గా ఓ ఈవెంట్ కు హాజరైన పూజాను చూస్తే ఎవరైనా సరే కళ్ళు తిప్పుకోలేరు.  ఉల్లిపొర లాంటి డ్రెస్ లో వావ్ అనిపించే విధంగా ఉంది.  కళ్ళు తిప్పుకోలేకుండా చేస్తున్న పూజ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది.  మీరు ఓ లుక్కేయండి.