చూపులతో మాయ చేస్తున్న శ్రీదేవి.. 

చూపులతో మాయ చేస్తున్న శ్రీదేవి.. 

డీజే సినిమా తరువాత పూజా హెగ్డే దశ మారిపోయింది.  ఆ సినిమా తరువాత వరసగా ఆమెకు ఆఫర్లు వచ్చాయి.  సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.  అరవింద సమేత, మహర్షి సినిమాలు హిట్ కొట్టడంతో మంచి జోరు మీదుంది పూజా.  ఇటీవలే గద్దలకొండ గణేష్ సినిమాలో శ్రీదేవిగా నటించి మెప్పించింది.  ఎల్లువొచ్చి గోదారమ్మా సాంగ్ లో శ్రీదేవిలా  నర్తించి మెప్పించింది పూజా.  

ఈ సినిమా తరువాత ఇప్పుడు అల్లు అర్జున్ తో అల వైకుంఠపురంలో, ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తున్నది.  వరసగా సినిమాలు చేస్తూ.. తీరికలేకుండా బిజీగా ఉన్న ఈ టాప్ హీరోయిన్ సోషల్ మీడియా మీడియాలో సైతం తనదైన శైలిలో దూసుకుపోతున్నది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వావ్ అనిపిస్తోంది.  రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలు చూసి యూత్ ఫిదా అయ్యింది. ఇక నెటిజన్లను ఈ ఫోటోలకు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.  వైరల్ అవుతున్న ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.