రాధేశ్యామ్ సినిమాకు తలనొప్పి తెచ్చిన పూజ.. ఏమైందంటే..

రాధేశ్యామ్ సినిమాకు తలనొప్పి తెచ్చిన పూజ.. ఏమైందంటే..

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్‌లో ఉన్నాడు. ప్రభాస్ చేస్తున్న నూతన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్దే కథానాయికగా నటించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా విడదులకు పూజానే అడ్డంకిగా మారిందట. అసలు ఈ సినిమా షూటింగ్‌కు డిసెంబర్‌లో స్వస్థి పలకాలను నిర్ణయించారట. కానీ అనుకున్నట్లు జరగలేదు. ఇంకా కొంత చిత్రీకరణ పెండింగ్‌లో ఉంది. దీనికి ప్రదాన కారణంగా చిత్ర యూనిట్ హీరోయిన్ పూజా హెగ్దేనే చూపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్, పూజా కాంబోలో కొన్ని సీన్స్ చిత్రకరించాల్సి ఉందట. కానీ అవి చిత్రీకరణ నిలిచిఉంది. ఎందుకంటే ప్రస్తుతం పూజ హిందీలో కొన్ని సినిమాలు చేస్తుంది. రణవీర్ సింగ్‌తో ఒక సినిమా, సల్మాన్ ఖాన్‌తో మరో సినిమాలో బుట్టబొమ్మ నటిస్తోంది. ఈ సినిమాలకు మొదట డేట్స్ ఇచ్చిన పూజ రాధేశ్యామ్‌ను పెండింగ్‌లో పెట్టింది. అయితే ఈ సమస్యలను అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ కూడా చవిచూసింది. తరువాత హిందీ సినిమాలను పూజ పూర్తి చేసింది. మరి ఇప్పుడు రాధేశ్యామ్‌కు ఎప్పుడు మోక్షం ప్రసాదిస్తుందా అని అందరూ వేచి చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా చిత్రీకరణే పూర్తి కలేదు. దాంతో సినిమా ఇంకెప్పుడు రిలీజ్ అవుతందని ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానుల కోసమైనా ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి.