అలా చేయడం అంటే పూజాకు ఇష్టమట..!!

అలా చేయడం అంటే పూజాకు ఇష్టమట..!!

టాలీవుడ్లో టాప్ హీరోయిన్ కేటగిరిలో టాప్ గేర్ లో దూసుకుపోతున్న నటి పూజా హెగ్డే.  ముకుందా సినిమాలో సాధారణ అమ్మాయిగా కనిపించిన పూజా.. డీజే సినిమా తరువాత ఆమె ఫేట్ మారిపోయింది. వరసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది.  డీజే సినిమాలో బ్లాక్ కలర్ బికినిలో మెరుపులు మెరిపించింది.  ఇదే ఆమెకు కలిసొచ్చింది.  

ఆ తరువాత అరవింద సమేత, మహర్షి సినిమాలు మంచి విజయాలు అందించాయి.  సినిమా రంగంలోకి వచ్చిన తరువాత ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలి అంటే తప్పనిసరిగా ఫిట్ గా ఉండాలి .  ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నం చేయాలి.  ఫిట్ గా ఉంటేనే సినిమాల్లో అవకాశాలు వస్తాయి.  అందుకే ఆమె నిత్యం ఫిట్నెస్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది.  ఎక్కడ ఉన్నా సరే ఉదయాన్నే జిమ్ చేయడం మాత్రం మానదట.  కొన్ని ఫిట్నెస్ వస్తువులను కూడా తీసుకెళ్తుందట పూజా.  సినిమా రంగంలోనే కాదు మాములుగా కూడా ఫిట్ గా కూడా ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నం చేయాలనీ, అప్పుడే ఇండస్ట్రీలో నిలబడతారని అంటోంది.