చైతు స‌ర‌స‌న మరోసారి ‘లైలా’ !

చైతు స‌ర‌స‌న మరోసారి ‘లైలా’ !

ప్రస్తుతం టాప్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగులో ‘రాధేశ్యామ్‌' ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రాల్లో నటిస్తోంది. అక్కినేని నాగచైతన్య ఇటీవలే ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు. తాజాగా నాగచైతన్య, విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘థాంక్యూ’. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాలో కథానాయిక కోసం పలువురు అగ్ర నాయికల పేర్లను పరిశీలిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయికగా ఖరారైందని తెలుస్తోంది. గతంలో నాగచైతన్య, పూజాహెగ్డే జోడీ ‘ఒకలైలా కోసం’ చిత్రంలో నటించారు. సుదీర్ఘ విరామం తర్వాత  మరలా వీరిద్దరు జంటగా నటిస్తుండటం విశేషం. ‘థాంక్యూ’ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా అవకాశం ఉండటంతో రష్మిక, అవికా గోర్ లాంటి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.