ముగ్గురు హీరోలతో మూడు షిఫ్టుల్లో

ముగ్గురు హీరోలతో మూడు షిఫ్టుల్లో

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్స్ లో  పూజా హెగ్డే ఒకరు.  వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది.  కెరీర్లో అరవింద సమేత తప్పించి పెద్ద హిట్ లేదు.  అరవింద సమేత సినిమా చేస్తూనే... మహేష్ తో మహర్షి షూటింగ్ లో పాల్గొంది.  మరోవైపు ప్రభాస్ 20 వ సినిమా షూటింగ్ లో మరో షిఫ్ట్ లో వర్క్ చేసింది.  ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసినట్టు పూజా హెగ్డే చెప్పింది. 

అరవింద సమేత సినిమా చేస్తుండగానే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో హౌస్ ఫుల్ 4 చేసింది.  అన్నింటికీ సమయాన్ని సమయాన్ని సర్దుబాటు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా పరుగులు తీసింది.  మహర్షికి పాజిటివ్ వైబ్ ఉండటంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి.  ఈ అంచనాలను అందుకొని సినిమా హిట్టయితే... పూజా కెరీర్లో మరింత షైన్ అవుతుంది.