పూజ హెగ్డేకు ఆ మత్తు ఇంకా దిగలేదు

పూజ హెగ్డేకు ఆ మత్తు ఇంకా దిగలేదు

ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లు ఎవరంటే గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే.  వరుసగా 'అరవింద సమేత, మహర్షి' సినిమాల్లో కనిపించిన ఈమె నెక్స్ట్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్ సినిమాలో నటిస్తోంది.  స్టార్ హీరోలు, దర్శకులు ఈమె డేట్స్ కోసం ఎదురుచూసే పరిస్థితి.  కానీ పూజా మనసు మాత్రం బాలీవుడ్ మీదుంది.  గతంలో కూడా తెలుగులో నిలదొక్కుకుంటోంది అనుకునే సమయానికి హిందీలో 'మొహంజొదారో' ఛాన్స్ దొరికే సరికి ఇక్కడి ఆఫర్లు వదిలేసి చెంగు చెంగున వెళ్ళిపోయింది.  

కానీ ఆ సినిమా ఫ్లాపవడంతో తెలుగు ఆఫర్ కోసం చాలారోజులు ఎదురుచూసి ఎట్టకేలకు ఈమధ్యే పుంజుకుంది.  ఇదే ఫామ్ చూపిస్తే ఆమె నిలదొక్కుకోవడం ఖాయం అనుకునే సమయానికి హిందీలో 'ముంబై సాగ' అనే సినిమాలో ఆఫర్ రాగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది.  దీంతో ఆమెకు బాలీవుడ్ మీద మక్కువ తీరలేదని అర్థమైంది.  కొందరైతే తెలుగులో స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు హిందీలోకి వెళ్లి దాన్ని డ్యామేజ్ చేసుకోవడం ఎందుకు, ఒకవేళ గతంలో పరిస్థితే మళ్ళీ వస్తే ఈసారి నిలదొక్కుకోవడం కష్టమని అంటున్నారు.