మహేష్ స్పెషల్ సాంగ్ లో జిగేల్ రాణి..!!? 

మహేష్ స్పెషల్ సాంగ్ లో జిగేల్ రాణి..!!? 

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  సెప్టెంబర్ 13 వ తేదీతో కొండారెడ్డి బురుజుకు సంబంధించిన షెడ్యూల్ పూర్తవుతుంది.  ఈ షెడ్యూల్ తరువాత మిగతా మిగతా షూటింగ్ ను వీలైనంత త్వరలోనే పూర్తి చేయాలని అనుకుంటున్నారు.  ఆ విధంగానే ప్లాన్ చేశారు.  నవంబర్ వరకు షూటింగ్ మొత్తం పూర్తి కాబోతున్నది.  ఇందులో మహేష్ బాబు ఇంట్రో సాంగ్ ఉన్నది.  ఈ సాంగ్ లో మొదట మీనాక్షి దీక్షిత్ ను తీసుకోవాలని అనుకున్నా.. అనిల్ రావిపూడి తమన్నా వైపుకు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.  

అయితే, తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ ఇంట్రో సాంగ్ లో పూజా హెగ్డే నటిస్తోందని దానికోసం ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని అంటున్నారు.  ఇందులో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాల్సి ఉన్నది.  రష్మిక మందన్న హీరోయిన్.  విజయశాంతి కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.