చిట్టి బాబుతో జతకట్టనున్న జిగేలు రాణి

చిట్టి బాబుతో జతకట్టనున్న జిగేలు రాణి

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటుగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రలో చేయనున్నాడు. ఇందులో దాదాపు నలభై నిమిషాల నిడివి ఉన్న పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న రాంచరణ్ ఆచార్య షూటింగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా ఆచార్య టీం విడుదల చేసింది. ఇందులో చెర్రీ సిద్ద అనే పాత్రలో చేయనున్నాడు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాలో రాంచరణ్ జోడీగా ఎవరు చేయనున్నారని తేలలేదు. మొదట చరణ్ సరసన కియారా అద్వానీ చేయనుందని వార్తలు వినిపించాయి. తర్వాత లక్కీ బ్యూటీ రష్మికా అని సాయిపల్లవి అని అనేక వార్తలు వినిపించాయి. అయితే తాజాగా బుట్టబొమ్మ పూజ పేరు వినిపిస్తుంది. మొదటగా ఆచార్య టీం రష్మిక, సాయిపల్లవిలను ఈ విషయంపై సంప్రదించగా వారు కొన్న కారణాల కారణంగా దీనిని తిరస్కరించారు. దాంతో చిత్ర యూనిట్ జిగేలు రాణి పూజా హెగ్దేను కలిసారు. దాంతో అమ్మడు ఇందులో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఆచార్య  సినిమాలో రాంచరణ్ జోడీగా పూజా చేస్తోంది. దాంతో ఆచార్య చిత్రీకరణలో పూజా వచ్చే నెల నుంచి పాల్గొననుంది. వీరి ఇద్దరి మధ్య ఓ అందమైన రొమాంటిక పాట కూడా ఉందట. అయితే ఈ సినిమా మే7న విడుదల చేయాలని చిత్ర టీం చూస్తోంది. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.