చెన్నై టూ ముంబై... అంతటా అరవిందే!

చెన్నై టూ ముంబై... అంతటా అరవిందే!

అందాల అరవింద అక్కడ, ఇక్కడా అన్న తేడా లేకుండా అంతటా అలరిస్తోంది. పేరుకి బెంగుళూరు బ్యూటీ అయినా... కన్నడలో కాకుండా తమిళ, హిందీతో పాటూ తెలుగులో శరవేగంగా దూసుకుపోతోంది. తన తోటి హీరోయిన్స్ ఒక్క భాషలో టాప్ స్టార్ అవ్వటానికే ఆపసోపాలు పడుతోంటే... పూజా పాప మాత్రం మూడు భాషల్లో సత్తా చాటుతోంది!

పూజా హెగ్డే ప్రస్తుతం తమిళంలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అదీ కోలీవుడ్ టాప్ స్టార్ దళపతితో రొమాన్స్ చేయటానికి రెడీ అవుతోంది. ఫస్ట్ తమిళ్ సినిమాతోనే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇక హిందీలోనూ ఈ సౌత్ సౌందర్యం హాట్ కేక్ లా మారింది. ఒకేసారి సీనియర్ స్టార్ సల్మాన్ తోనూ, యంగ్ హీరో రణవీర్ తోనూ జోడీ కడుతోంది. ఇప్పటికే హృతిక్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలతోనూ రొమాన్స్ పూర్తి చేసేసింది. మరిక తెలుగు తెరపై మన 'అమూల్య మేడమ్' జోరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా? బుట్ట బొమ్మ ఎప్పుడో ఇక్కడి కుర్రాళ్లని బుట్టలో వేసేసుకుంది. ప్రభాస్ నుంచీ అఖిల్ అక్కినేని వరకూ అందరు హీరోల్లోనూ ఆమె క్రేజ్ నెలకొంది!

హిందీలో పాప్యులర్ గా మారి, తమిళంలో ఎంట్రీ ఇస్తూ... తెలుగులో ఫుల్ డిమాండ్ మీద ఉన్న పూజానే ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్ అంటున్నారు విమర్శకులు. ఏదో ఒక్క భాషకు పరిమితం కాకుండా అక్కడా, ఇక్కడా అంతటా అలజడి రేపుతోంది... అరవింద!