రాధేశ్యామ్: షూటింగ్ పూర్తి చేసిన పూజ
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'రాధే శ్యామ్'. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే, తాజాగా హీరోయిన్ పూజ హెగ్డే తన షూటింగ్ పార్ట్ ను పూర్తిచేసుకుంది. తన షూటింగ్ పూర్తయినట్టు పూజ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. 'రాధేశ్యామ్' 30 రోజుల లాంగ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని, షూటింగ్ స్పాట్ నుంచి ఇంటికి వెళుతున్నానని పూజ తెలిపింది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిపోతున్నట్టు పేర్కొంది. కాగా, 'రాధే శ్యామ్' వేసవిలో తీసుకొచ్చేనందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ 'సలార్' మూవీని ప్రారంభించనున్నాడు. ఇటీవలే సలార్ యూనిట్ పూజ కార్యక్రమాలు జరుపుకుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)