పూజా రాక్స్.. నెటిజన్ షాక్స్

పూజా రాక్స్.. నెటిజన్ షాక్స్

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా వుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. తాజాగా సోషల్ మీడియా వేదిక ఇన్స్‌స్టాగ్రామ్ లో కాసేపు నెటిజన్లతో టచ్ లోకి వచ్చింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు పూజా సమాధానాలు ఇచ్చింది. కాగా, ఒక నెటిజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న పిక్ షేర్ చెయ్యమని అడగ్గా.. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్‌తో తీసుకున్న క్యూట్ పిక్ పోస్ట్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా, అంతలోనే ఓ నెటిజన్ తుంటరి పని చేశాడు. ఏకంగా పూజా హెగ్డేను న్యూడ్ ఫొటో పెట్టమంటూ రిక్వెస్ట్ చేశాడు. దీంతో వెంటనే చాకచక్యంగా వ్యవహరించిన పూజా.. అతనికి దిమ్మ తిరిగే ఫొటో పోస్ట్ చేసింది. అడిగినట్లుగానే న్యూడ్ గా ఉన్న తన రెండు కాళ్లను పిక్ తీసి షేర్ చేసింది. పూజా హెగ్డే ఏమాత్రం కోపానికి రాకుండా ఇచ్చిన రియాక్షన్ బట్టి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.