విజయ్‌తో రొమాన్స్‌ చేయనున్న బుట్టబొమ్మ..?

విజయ్‌తో రొమాన్స్‌ చేయనున్న బుట్టబొమ్మ..?

ఒక లైలా కోసం అంటూ తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయంలో ఎంట్రీ ఇచ్చింది పూజాహెగ్డే .  ఆకట్టుకునే అందంతో పాటు, అభినందించదగిన అభినయం కూడా ప్రదర్శించగల హీరోయిన్ పూజ హెగ్డే. ఒక లైలా కోసం సినిమా తరవాత ముకుందా సినిమాలో మెరిసింది ఈ చిన్నది. ఇక ఈ మధ్య బన్ని, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురములో నటించి భారీ హిట్‌ అందుకుంది ఈ బుట్టబొమ్మ. ప్రస్తుతం ఈ భామ అఖిల్‌ అక్కినేని "మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌" లో నటిస్తోంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా రిలీజ్‌ కానుంది.  ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ.  ఇది ఇలా ఉండగా.. పూజా హెగ్డేకు మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్లు టాక్‌ నడుస్తోంది. మాస్టర్‌ సినిమా తర్వాత తమిళ స్టార్‌ హీరో విజయ్‌ చేస్తున్న సినిమాలో ఈ బుట్టబొమ్మ ఛాన్స్‌ కొట్టేసిందట. ఇప్పటికే పూజతో దర్శకుడు నెల్సన్‌ సంప్రదింపులు జరిపాడట. దీనికి సానుకూలంగానే స్పందించిందట పూజ. అయితే.. దీనిపై తర్వలోనే క్లారిటీ రానుంది.