గద్దలకొండ గణేష్ కు పూజా హెల్ప్ అవుతుందా?

గద్దలకొండ గణేష్ కు పూజా హెల్ప్ అవుతుందా?

గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకి.. సెప్టెంబర్ 20వ తేదీన థియేటర్లలో సందడి చేయబోతున్నాడు.  సినిమాపై అంచనాలు మాములుగా లేవు.  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగినట్టు సమాచారం.  ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.  పూజా కెరీర్ టర్న్ కావడానికి మెయిన్ రీజన్ హరీష్ శంకర్.  హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే సినిమా వచ్చింది.  ఆ సినిమాలో పూజాను ఎలా చూపించాలో ఆలా చూపించాడు.  సినిమా బంపర్ హిట్ అయ్యింది.  

ఈ సినిమా తరువాత పూజా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.  అరవింద సమేత, మహర్షి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.  ఇప్పడు ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తున్నది.  వాల్మీకి సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం.  వరుణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పూజా కనిపిస్తుందట.  పాత్ర చిన్నదే కాబట్టి ఆ పాత్ర సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.