అసభ్య వీడియోలపై మరోసారి పూనమ్‌కౌర్ ఫిర్యాదు..

అసభ్య వీడియోలపై మరోసారి పూనమ్‌కౌర్ ఫిర్యాదు..

తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగే విధంగా సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అసభ్య రాతలు రాస్తున్నారని, వీడియోలు పెడుతున్నారంటూ బుధవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీనటి పూనమ్‌కౌర్‌.. ఇవాళ మరోసారి సీసీఎస్ సైబర్ క్రైమ్ కి వెళ్లారు. అక్కడ అడిషనల్ డీసీపీ రఘువీర్ ని కలిసి ఆమె.. తనపై యూట్యూబ్‌లో అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పూనమ్‌కౌర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అడిషనల్ డీసీపీ రఘువీర్ తెలిపారు. 36 యూట్యూబ్ ఛానల్ పై పూనం ఫిర్యాదు చేసిందని.. కేసు దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.