రొమాంటిక్ గా పూర్ణ ‘బ్యాక్ డోర్’ టీజర్

రొమాంటిక్ గా పూర్ణ ‘బ్యాక్ డోర్’ టీజర్

హీరోయిన్ పూర్ణ ప్రస్తుతం నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘బ్యాక్ డోర్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌‌లో హీరోయిన్ పూర్ణ, తేజ మధ్య సన్నివేశాలు రొమాంటిక్ గా ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. పూర్ణ, తేజ మధ్య కెమిస్ట్రీ బాగా పండినట్టు తెరపైన కనిపించింది. దర్శకుడు బాలాజీ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోను కనిపించింది. బి శ్రీనివాస్‌రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ డోర్ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, ప్రముఖ దర్శకుడు వీరశంకర్ లతో పాటుగా పలువురు హాజరైయ్యారు.