'యాత్ర' సినిమాలో మరొక ప్రముఖ నటి !
దర్శకుడు మహి.వి.రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం 'యాత్ర'. దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి జీవితం, ఆయన చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో ప్రముఖ స్టార్ నటుడు మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకుంది ఈ చిత్రం.
ఈ చిత్రంలో ప్రముఖ నటి కళ్యాణి కూడ ఒక కీలక పాత్ర చేయనుంది. 'అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, వసంతం, పెదబాబు, దొంగోడు' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు పొందిన కళ్యాణి 'లక్ష్యం, మున్నా, లెజెండ్' వంటి సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు చేసి మెప్పించారు. ఇంతకీ ఈమె సినిమాలో ఏ పాత్ర చేస్తున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)