'అరవింద సమేత'లో పాడనున్న పాపులర్ సింగర్ !

'అరవింద సమేత'లో పాడనున్న పాపులర్ సింగర్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా 'అరవింద సమేత'.  ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి సంగీతం అందించి ఆకట్టుకున్న తమన్ పాటలు కూడ అభిమానుల్ని మెప్పించే విధంగా ఉండేలా చూసుకుంటున్నారు. 

అందుకే సినిమాలో ఒక పాటను పాపులర్ సింగర్ దలేర్ మెహెన్ది చేత పాడిస్తున్నారు.  ఈ పాట చాలా బాగుంటుందని, సంగీతం మీద ప్రేమ భాషతో ముడిపడి ఉండదని దలేర్ ట్వీట్ చేశారు.   త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్నారు.