కేటీఆర్ అవినీతి చేశారని నిరూపిస్తే...నా చెంపపై కొట్టండి... 

కేటీఆర్ అవినీతి చేశారని నిరూపిస్తే...నా చెంపపై కొట్టండి... 

పోసాని కృష్ణ మురళి ఈరోజు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.  పోసాని ప్రెస్ మీట్ అనగానే ఏపి రాజకీయాల గురించి ఉంటాయని అందరూ అనుకున్నారు.  కానీ, అనూహ్యంగా పోసాని తన దృష్టిని తెలంగాణపై పెట్టి రేవంత్ పై విమర్శలు గుప్పించారు.  దేశంలో ఏ నాయకుడు కూడా రూ.50 లక్షలు లంచం ఇస్తూ పట్టుబడిన దాఖలాలు లేవని, ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు.  

లంచం ఇస్తూ పట్టుబడిన రేవంత్ రెడ్డి కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.  కేటీఆర్, హరీష్ రావులు నిజాయితీ పరులు అని చెప్పిన పోసాని, కేటీఆర్ అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే తాను తెరాస కు వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పుకొచ్చాడు.  కేటీఆర్, హరీష్ రావులు తెలంగాణకు రెండు కళ్ళ వంటివారు అని చెప్పారు.  కేటీఆర్ మంచి వక్త అని, కేసీఆర్ నోట్లో నుంచి ఊడిపడినట్టుగా ఉంటాడని అన్నారు. కేటీఆర్ లంచాలు తీసుకోరని, ఒకవేళ తీసుకున్నట్టుగా మీకు తెలిస్తే వచ్చి నన్ను చెంపమీద కొట్టండి అని పోసాని ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు.   

ఇక కాళేశ్వరం నిర్మాణం కేసీఆర్ డ్రీం అని చెప్పిన పోసాని, కాళేశ్వరం డ్యామ్ ను కమిషన్ల కోసమే నిర్మించారని ప్రతిపక్షాలు చెప్పడం అవివేకం అని అన్నారు.  అధికారంలోకి రావాలంటే ప్రజల మధ్యలో ఉంది వారి బాధలు తెలుసుకొని వాటిపై పోరాటం చేస్తే ప్రజలు అధికారం ఇస్తారని అన్నారు.