శైలజా.. యూటర్న్ ఎలా ఉన్నాయంటే..!!

శైలజా.. యూటర్న్ ఎలా ఉన్నాయంటే..!!

నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు, సమంత యూటర్న్ సినిమాలు ఈరోజు రిలీజ్ అయ్యాయి.  ఇప్పటికే ఈ సినిమాల ప్రీమియర్ షోలు ముగిశాయి.  రెండు వేర్వేరు జానర్లో వస్తున్న సినిమాలు కావడంతో ఆసక్తి పెరిగింది.  పెళ్లి తరువాత ఈ ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల అవుతుండటంతో పోటీ కూడా ఉందనే చెప్పాలి.  నాగచైతన్య.. శైలజా రెడ్డి అల్లుడు విషయానికి వస్తే.. మారుతి సినిమాను హ్యాండిల్ చేసిన విధానం బాగుందని, గత సినిమాల కంటే నాగ చైతన్య చాలా యాక్టివ్ గా పాజిటివ్ ఆటిట్యూడ్ ఉన్న పాత్రలో ఆకట్టుకునే విధంగా నటించాడని సమాచారం.  

అటు హర్రర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన సమంత యూటర్న్ సినిమా కూడా బాగుందని ప్రచారం జరుగుతున్నది.  ట్విట్టర్ లో ఇప్పటికే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.  వినాయక చవితి రోజున రిలీజైన రెండు సినిమాలు బాగున్నాయనే టాక్ రావడంతో.. అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  లంబోదరుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ పూజలు చేస్తున్నారు.