చంద్రునిపై పంటపండుతుందట..!

చంద్రునిపై పంటపండుతుందట..!

మనిషి విజ్ఞానం పరిధి ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నది.  ఇప్పటి వరకు భూమి ఒక్కటే మనిషి ఆవాసయోగ్యంగా ఉన్నది.  భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపై మనిషి ఆవాసం ఏర్పాటు చేసుకునే దిశగా పరిశోధనలు చేస్తున్నారు.  ఒకవేళ మనిషి చంద్రునిపై ఆవాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే అక్కడ ఆహారం అవసరం ఉంటుంది.  భూమిపై నుంచి ఆహారాన్ని చంద్రునిపైకి తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు.  అందుకే అక్కడే పంటలు పండించే విషయంలో పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.  

చంద్రునిపైన, అంగారకుడిపైన ఉన్న వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి..  విచిత్రంగా పదిరకాల మొక్కలు మొలిచాయి.  వాటి నుంచి కాయగూరలు కూడా వచ్చాయి.  ఇందులో పాలకూర మాత్రం అనుకున్నంతగా పెరగలేదు.  పాలకూర మినహా మిగతా కాయకూరలు మంచిగా పండాయి.  అయితే, వీటి నుంచి వచ్చిన విత్తనాలను తిరిగి నాటితే వాటిల్లో కొన్ని మాత్రమే మొలకెత్తాయి.  ప్రస్తుతం దీనిపై పరిశోధన చేస్తున్నారు.  2028 నాటికి చంద్రునిపై నివాసం ఏర్పాటు చేసుకునే దిశగా నాసా పరిశోధనలు చేస్తున్నది.