అనిల్ చంద్ర పునేఠాకు పోస్టింగ్ 

అనిల్ చంద్ర పునేఠాకు పోస్టింగ్ 

ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠాకు పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు అనిల్ చంద్ర పునేఠాను తప్పించి ఆ స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఏపీ సీఎస్ గా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆయనకు ఎన్నికల విధులతో సంబంధంలేని పోస్టింగ్ ఇవ్వాలని తెలిపింది. ఈనెల 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.