పార్లమెంటు ఆవరణలో ఆలూ

పార్లమెంటు ఆవరణలో ఆలూ

రైతుల పట్ల మోడీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ప్రభుత్వ విధానాల వల్ల ఉల్లి గడ్డలు పూర్తిగా దెబ్బతిన్నాయని... ఇపుడు బంగాళ దుంపల రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం చెవిటిది, గుడ్డిదని.. అందుకే ఆ ప్రభుత్వానికి చూపించేందుకు పార్లమెంటు ఆవరణలోకి బంగాళ దుంపలను తెచ్చినట్లు ఎంపీలు వివరించారు. పార్లమెంటు ఆవరణలో ఒకవైపు టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తుండగా, గాంధీ విగ్రహానికి ఎదురుగా సంచిలో తెచ్చిన బంగాళ దుంపలను మీడియాకు ప్రదర్శించారు ఎంపీలు. దేశంలో రైతులు పరిస్థితి చాలా దారుణంగా తయారైందని, గిట్టుబాటు ధరలు లేక రైతులు విలవిల్లాడుతున్నాడని వీరు ఆరోపించారు.