20 ఏళ్లుగా చంద్రబాబు నరకం చూపించారు.. సునీత సంచలన వ్యాఖ్యలు !

20 ఏళ్లుగా చంద్రబాబు నరకం చూపించారు.. సునీత సంచలన వ్యాఖ్యలు !

ఈ రోజు ఏపి శాసనమండలి  వైసీపీఎమ్మెల్సీ అభ్యర్థిగా  పోతుల సునీత నామినేషన్ ధాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒక సెట్ నామినేషన్ వేశానని అన్నారు. సిఎం జగన్ ఆశీస్సులు తో నామినేషన్ వేశానన్న ఆమె సంక్షేమ పధకాలు ప్రజలకు అందజేయాలని సిఎం జగన్ తపన పడుతున్నారని అన్నారు. సంక్షేమానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని కోర్టులను  అడ్డు పెట్టుకుని సంక్షేమానికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు కుట్రకుతంత్ర రాజకీయాలు చేస్తున్నారన్న ఆమె దేవున్ని కూడా చంద్రబాబు వదలడం లేదు అని అన్నారు. బాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్న ఆమె 20 ఏళ్లు టిడిపిలో పని చేశా ఆ సమయంలో చంద్రబాబు నరకం చూపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మూడు నెలలకు సిఎం జగన్ నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థి గా ప్రకటించారని ఆమె చెప్పుకొచ్చారు.