మండుతున్న కోడిధరలు

మండుతున్న కోడిధరలు

కోడిమాంసం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఎండదెబ్బకు మరింత ప్రియంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్ రేటు డబుల్ సెంచరీ దాటి ఎండ వలె మండుతూ దూసుకుపోతుంది. దీంతో చికెన్ అంటేనే సామాన్యుడు భయపడే పరిస్థితి వచ్చింది. మొన్నటివరకు రూ. 160 ఉన్న కిలో చికెన్ ధర ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ దాటి రూ. 213 వరకు చేరుకుంది. తీవ్రమైన ఎండవేడిమి కారణంగా 15శాతం మరణించడంతో ఇంకా ధర ప్రియమైనట్లు తెలుస్తోంది. అలాగే... ఎండప్రభావం ఎక్కువగా ఉండటంతో కోళ్లు మరణించడం... మార్కెట్లో మాంసం కొరత కారణంగా ధర పెరిగినట్లు పరిశ్రమ నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. ఇంకా మరికొద్ది రోజుల్లోనే రంజాన్ నెల ప్రారంభం కానుండటం కూడా కోడి ధర ప్రియానికి కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు.