పాక్.. లంక మ్యాచ్ మధ్యలో పవర్ కట్... ట్విట్టర్లో జోకులు..!! 

పాక్.. లంక మ్యాచ్ మధ్యలో పవర్ కట్... ట్విట్టర్లో జోకులు..!! 

పాక్.. శ్రీలంక జట్ల మధ్య సోమవారం రోజున రెండో వన్డే మ్యాచ్ జరిగింది. డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో.. ఫ్లడ్ లైట్ ల వెలుగులో మ్యాచ్ లను నిర్వహించారు.  మ్యాచ్ జరుగుతుండగా కరాచీ స్టేడియంలో ఉన్న ఫ్లడ్ లైట్లు పదేపదే ఆగిపోవడంతో మ్యాచ్ కు పలుమార్లు అంతరాయం జరిగింది.  దాదాపు 26 నిమిషాలపాటు ఆటకు అంతరాయం కలిగింది. పదేపదే అంతరాయం కలగడంతో శ్రీలంక ఆటగాళ్లు మ్యాచ్ పై దృష్టిపెట్టలేకపోయారు.  

ఇక సిటీ ఆఫ్ లైట్స్ గా పేరుగాంచిన కరాచీ నగరంలోని స్టేడియంలో జరిగిన ఈ సంఘటనపై ట్విట్టర్లో జోకులు పేలాయి.  సిటీఆఫ్ లైట్స్ లో లైట్స్ వెలగడం లేదు.  స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది.. కరెంట్ బిల్లులు కట్టండి.. అంటూ ట్విట్టర్లో క్రికెట్ అభిమానులు జోకులు వేశారు. ఒక అంతర్జాతీయ మ్యాచ్ లో పదేపదే ఫ్లడ్ లైట్స్ ఆఫ్ కావడం ఆ దేశానికీ అవమానకరం అని చెప్పాలి.