పవర్ స్టార్ కొత్త లుక్ వైరల్

పవర్ స్టార్ కొత్త లుక్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వకీల్‌సాబ్ సినిమాతో తన రీఎంట్రీని గ్రాండ్‌గా ప్లాన్ చేసిన పవన్ వరుస సినిమాలు చేస్తూ ప్రకటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే వకీల్‌సాబ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేయనున్నాడు. దాని తరువాత సాగర్ కే దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియుమ్ సినిమా రీమేక్ చేయనున్నాడు. ప్రస్తుతం పవన్ చేస్తున్న ఈ సినిమాలో రానా కూడా ప్రధాన చేస్తున్నాడట. వీరిద్దరి కాంబోను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలోని పవన్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానులు ఈ లుక్ చూసి ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే పేరును చర్చిస్తున్నారట. ఈ సినిమా చిత్రీకరణను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సినిమా పిరియాడికల్ డ్రాప్‌తో రూపొందుతుండటంతో దీనికి విరూపాక్ష అనే పరును ఖరారు చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు నామకరణ జరగలేదు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.