నాగ చైతన్యకు పవర్ఫుల్ నేమ్ !

నాగ చైతన్యకు పవర్ఫుల్ నేమ్ !

నాగ చైతన్య చేసే ప్రతి సినిమాలో ఆయన పాత్ర పేరు కొంచెం ఘనంగానే ఉండేలా చూసుకుంటారు.  ఇప్పటికే శివ, విక్రమ్, సత్య, సూర్య, అర్జున్ లాంటి పేర్లు ట్రై చేసిన ఆయన ఈసారి కూడా లాంటి పవర్ఫుల్ పేరునే పెట్టుకుంటున్నారు.  తాజాగా ఆయన శివ నిర్వాణ డైరెక్షన్లో 'మజిలీ' అనే సినిమా  చేస్తున్నారు.  ఇందులో ఆయన పాత్ర పేరు పూర్ణ అట.  పేరుకి తగ్గట్టే చైతన్య పాత్రలో మంచితనం, మొరటుతనం రెండూ ఉంటాయని తెలుస్తోంది.  చైతన్యకు జంటగా సమంత నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.