ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న ప్రభాస్.. ఎలా అంటే..

ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న ప్రభాస్.. ఎలా అంటే..

రెబల్ స్టార్ ప్రభాస్‌పై అభిమానులు అలిగిన విషయం తెలిసిందే. నూతన సంవత్సర వేడుకకు రావాల్సిన రాధేశ్యామ్ టీజర్ సంక్రాంతికి కూడా రాకపోవడమే అభిమానుల అలకకు దారితీసింది. ప్రభాస్ సినిమా నుంచి అనుకున్న స్థాయి అప్‌డేట్‌లు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా ప్రభాస్ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడట. అతి త్వరలో రాధేశ్యామ్ నుంచి అందరికీ ఓ గిఫ్ట్ రానుందట. అయితే ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో ప్రభాస్ మొత్తం టీమ్‌కి ఖరీదైన వాచ్‌లు బహూకరించాడు. ఇదే క్రమంలో అభిమానులకు కూడా ఓ మంచి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. అతి త్వరలో ఈ సినిమా నుంచి ఓ క్యూట్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ గ్లింప్స్‌తో అందరినీ ఆకట్టుకోనున్నారు. అంతేకాకుండా ఇందులో హీరో, హీరోయిన్‌లు ఇద్దరు కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ లుక్స్‌ ఎలా ఉంటాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారైనా వీరు చెప్పిన విధంగా గ్లింప్స్‌ విడుదల చేస్తారా, ఇప్పటికే టీజర్ వస్తుందని చెప్పినా విడుదల కాలేదని కొందరు అంటున్నారు. మరి ఈ సారి ప్రభాస్ తన అభిమానులను ఎంతవరకు మెప్పిస్తాడో. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓ పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోంది. దీనిని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. మరి ప్రభాస్ వారి అంచనాలను అందుకుంటాడా అనేది చూడాలి.