ప్రభాస్ 'జాన్' అప్డేట్ వచ్చేసింది.. నవంబర్ నుంచే...

ప్రభాస్ 'జాన్' అప్డేట్ వచ్చేసింది.. నవంబర్ నుంచే...

ప్రభాస్ సాహో సినిమా తరువాత చేస్తున్న సినిమా జాన్.  పీరియాడికల్ లవ్ స్టోరీ సినిమా.  ఇటలీ నేపథ్యంలో కథ ఉంటుంది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.  ఇటలీలో అందమైన ఓ పల్లెటూరి లొకేషన్లో ఫస్ట్ షెడ్యూల్ ను చిత్రీకరించారు.  అక్కడే షూటింగ్ చేయాల్సి ఉన్నా.. అక్కడ చేయడం వలన ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన సెట్ ను హైదరాబాద్ లో వేసి షూట్ చేస్తున్నారు.  

ఇటలీలో 1970 కాలంలో ఉన్న గ్రామాన్ని సెట్ వేశారు.  అక్కడే షూటింగ్ చేయబోతున్నారు.  నవంబర్ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.  ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. గోపీచంద్ కు జిల్ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  వచ్చే ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.