ప్రభాస్21 కోసం ఏఆర్ రెహమాన్...?

ప్రభాస్21 కోసం ఏఆర్ రెహమాన్...?

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో మారో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణె ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్లో 21వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. కానీ ఈ సినిమాకు సంగీతం అందించేది ఎవరు నేది మాత్రం ఇంకా తెలియదు. అయితే ఇన్ని రోజులు కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు అని ప్రచారం జరిగింది. ఇప్పుడు అనుకోకుండా మరో పేరు కూడా తెరపైకి వచ్చింది, అదే ఏఆర్ రెహమాన్. ప్రస్తుతం రెహమాన్ తో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా కోసం ఈ ఆస్కార్ విన్నర్ నాలుగు కోట్ల రెమ్యునరేషన్ కూడా అడిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తీస్తాను అని చెప్పిన నాగ్ అశ్విన్ ఆ రేంజ్ ఉన్న వ్యక్తి సంగీతం అందించాలి అనుకున్నాడట! అందుకే రెహమాన్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించనున్నారు అని సమాచారం.