ప్రభాస్... అనుష్కలకు హాలీవుడ్ అఫర్... 

ప్రభాస్... అనుష్కలకు హాలీవుడ్ అఫర్... 

ప్రభాస్ .. అనుష్క టాలీవుడ్ లో సూపర్ జోడి.  అందులో సందేహం అవసరం లేదు.  బిల్లా, మిర్చి, బాహుబలి సీరీస్ లో కలిసి నటించారు.  ఈ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  కాగా, ఇటీవలే బాహుబలి సినిమా లైవ్ మ్యూజిక్ లండన్ లోని రాయల్ అల్బెర్ట్ హాల్ లో ప్రదర్శించారు.  148 సంవత్సరాల ఆల్బర్ట్ హాల్ చరిత్రలో మొదటిసారి నాన్ ఇంగ్లీష్ సినిమాను ప్రదర్శించారు.  

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు.  ఇదిలా ఉంటె, హాలీవుడ్ లో ఆఫర్లు వస్తే చేస్తారా అని అడిగితె.. హాలీవుడ్‌లో సరైన స్క్రిప్టు, ఆఫర్‌ వస్తే తప్పకుండా నటిస్తాను అని ప్రభాస్ చెప్పగా, నాకు భాష అడ్డంకి కాదు. సినిమాలో నటించడమే నా పని. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషా సినిమాల్లో నటించాలని ఉంది అని అనుష్క చెప్పింది.  సో, మంచి అఫర్ దొరికితే ఇద్దరు హాలీవుడ్ సినిమాలో నటిస్తారన్నమాట.