'రాధేశ్యామ్' షూటింగ్ ఆపేసిన ప్రభాస్ ?

'రాధేశ్యామ్' షూటింగ్ ఆపేసిన ప్రభాస్ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రాధేశ్యామ్'. 1960ల నాటి వింటేజ్‌ లవ్ స్టోరీగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ పాన్ ఇండియా లవ్ స్టోరీ. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా ఆగిపోయింది. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన చివరి షెడ్యూల్‌తో 'రాధేశ్యామ్' షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో 'రాధేశ్యామ్' షూటింగ్ ను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ టెక్నిషియన్స్, ఆర్టిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తన సన్నిహితులైన నిర్మాతలను వెంటనే ఈ షెడ్యూల్ క్యాన్సిల్ చేయాలని కోరారట. చివరి దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ 10 రోజులు మాత్రమే మిగిలి వుంది. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత 'రాధేశ్యామ్' షూటింగ్ మొదలవుతుంది.