నిజంగా మనసున్న మా'రాజు' ప్రభాస్

నిజంగా మనసున్న మా'రాజు' ప్రభాస్

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ తాజాగా ప్రధానమంత్రి సహాయనిధికి మూడు కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు. దీంతో అతడు ప్రకటించిన విరాళం మొత్తం నాలుగు కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రభాస్ ముందు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం అంటే చెరో యాభై లక్షల చొప్పున ప్రకటించాడు. ఇప్పుడు ప్రధానమంత్రి సహాయ నిధికి మరో మూడు కోట్ల మొత్తం ప్రకటించాడు. లాక్‌డౌన్ కారణంగా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు యావత్ దేశం ముందుకోస్తోంది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులైన మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్, నితిన్‌, త్రివిక్రమ్‌, దిల్‌రాజు, సాయితేజ్, అల్లరి నరేష్ వంటి వారు తమ వంతు సాయం ప్రకటించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రభాస్ రెండుసార్లు సాయం అది కూడా ఏకంగా నాలుగు కోట్లు ప్రకటించడం గమనార్హం. దీంతో ఆయన అభిమానులు అందరూ నిజంగా మనసున్న మా'రాజు' ప్రభాస్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.