ప్రభాస్ అక్కడి వాళ్ళనూ వదలడం లేదు..!!!

ప్రభాస్ అక్కడి వాళ్ళనూ వదలడం లేదు..!!!

ప్రభాస్ సాహో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకుంటూనే అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నది.  విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ఉత్కంఠతను కలిగించే అంశాలతో కూడిన అప్డేట్స్ ను అభిమానుల కోసం రిలీజ్ చేస్తూ ఆసక్తిని పెంచుతున్న సాహో, టాలీవుడ్ హీరోలనే కాకుండా.. కోలీవుడ్, శాండల్ వుడ్ హీరోలను కూడా ఇబ్బందులు పెడుతున్నాడు.  

సాహో ఆగస్టు 15 నుంచి 30 వ తేదీకి పోస్ట్ ఫోన్ అయ్యింది.  విజువల్ ఎఫెక్ట్స్ కారణం అని చెప్తున్నారు.  ఆగష్టు 15 న వస్తుంది అనుకోని చాలా సినిమాలు పోస్ట్ ఫోన్ అయ్యాయి.  ఇప్పుడు ఆగష్టు 30 న సినిమా రిలీజ్ అనే సరికి ఆ రోజున రావాల్సిన సినిమాలు మరోసారి పోస్ట్ ఫోన్ చేసుకోబోతున్నాయి.  నాని గ్యాంగ్ లీడర్ ఆగస్టు 30 న రిలీజ్ కావాల్సి ఉన్నా.. దానిని పోస్ట్ ఫోన్ చేస్తున్నారు.  ఈ మూవీతో పాటు సూర్య బందోబస్త్, కిచ్చా సుదీప్ పహిల్వాన్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.  దీంతో పాటు సెప్టెంబర్ 6 వ తేదీన రిలీజ్ అనుకున్న వాల్మీకి కూడా సెప్టెంబర్ 13 కి పోస్ట్ ఫోన్ అయ్యింది.