ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ.. కారణం అదే..

ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ.. కారణం అదే..

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తరువాత సాహో సినిమాతో అందరి ముందుకొచ్చిన ప్రభాస్ అక్కడి నుంచి పాన్ ఇండియా రేంజ్ కథలను లైన్‌లో పెట్టాడు. వెంటనే రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, నాగశ్విన్ ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటిలో రాధేశ్యామ్ సినిమా ఓ పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కతోంది. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా జరుగుతోంది. నిజానికి దీని షూటింగ్ గతేడాది డిసెంబరులో పూర్తి కావాల్సి ఉంది. కానీ కొన్న అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే అభిమానులు ఈ సినిమా కన్నా ముందుగా టీజర్ కోసం ఎక్కువ తాపత్రయ పడుతున్నారు. టీజర్ చూస్తే సినిమాలో ప్రభాస్, పూజా లుక్స్ ఎలా ఉంటాయనేది తెలుసుకోవచ్చు కదా. అయితే  ఈ సినిమా టీజర్ నూతన సంవత్సరం కానుకగా వస్తుందని ఊరట పెట్టిన చిత్ర యూనిట్ సంక్రాంతి వచ్చినా దీని ఊసు ఎత్తకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దాంతో టీజర్‌కే ఇంత ఆలస్యం చేశారు ఇక సినిమా విషయానికొస్తే పరిస్థితేంటని కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రస్థుతం రాధేశ్యామ్ టీజర్ కోసం ఎదురుచూస్తున్న వారు హర్ట్ అయ్యాం అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మరి ఈ విషయంలో రాధేశ్యామ్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.