ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక అదే...

ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక అదే...

బాహుబలి తరువాత ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎక్కువగా భాగం దుబాయ్ లో షూట్ చేశారు.  కళ్ళు చెరిగే ఫైట్ సీన్స్ ఇందులో ఉండబోతున్నాయి.  కథ చాలా భాగం దుబాయ్ నేపథ్యంలో నడుస్తుంది కాబట్టి, ఇండియాతో సంబంధం ఉన్నా...దానిని మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది తెలియాలి.  

ఈ సినిమాతో సమానంగా ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణతో జాన్ సినిమా చేస్తున్నాడు.  ఇది పీరియాడికల్ స్టోరీ.  ఇటలీ నేపథ్యంలో జరుగుతుంది.  దీనికోసం దాదాపు రూ.30 కోట్ల రూపాయలతో రామోజీ ఫిలిం సిటీలో 8 సెట్స్ వేసినట్టు తెలుస్తోంది.  కథ పరంగా ఇటలీతో సంబంధం ఉండటంతో... ప్రభాస్ ఎప్పుడు ఇండియన్ మూవీస్ చేస్తారు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.  వర్షం, ఛత్రపతి, మిర్చి, బాహుబలి వంటి సినిమాలు ఇండియన్ నేటివిటీ మూవీస్.  దీనికి విదేశాలతో సంబంధం ఉండదు.  ఇలాంటి సినిమాలను ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  ఫ్యాన్స్ కోరికను ప్రభాస్ ఎప్పుడు తీరుస్తారో మరి.