డెంగ్యూ బారిన పడిన ప్రభాస్ హీరోయిన్ !

డెంగ్యూ బారిన పడిన ప్రభాస్ హీరోయిన్ !

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ గత కొన్ని నెలలుగా ఇటు 'సాహో', అటు సైనా నెహ్వాల్ బయోపిక్ ప్రిపరేషన్ మరియు చిత్రీకరణల్లో ఉన్న సంగతి తెలిసిందే.  ఈ తీవ్ర పని ఒత్తిడి ఆమె ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపింది.  

ఒంట్లో బాగోలేకపోవడం వలన ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు డెంగ్యూ అని తేల్చారట.  దీంతో శ్రద్దా ఇంకో పది పదిహేను రోజులు షూటింగ్స్ కు చెక్ పెట్టి పూర్తి విశ్రాంతి తీసుకోనుంది.  శ్రద్దాకు 'సాహో'నే తెలుగులో మొదటి చిత్రం కావడం విశేషం.