రాంబోగా ప్రభాస్...!?

రాంబోగా ప్రభాస్...!?

ప్రభాస్ మరో ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సిద్ధార్థ్ అనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట. హాలీవుడ్ సూపర్ హిట్ సీరీస్ లో వచ్చిన 'రాంబో' చిత్రాన్ని సిద్ధార్థ్ ప్రభాస్ తో తీయబోతున్నాడట. నిజానికి ఈ సినిమాను సిద్ధార్థ్ టైగర్ ష్రాఫ్ తో తీయానుకున్నాడు. కానీ గణపత్1, 2 చిత్రాలతో పాటు హీరో పంతి2, బాఘీ 4, చిత్రాలతో టైగర్ 2023 వరకూ ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో సిద్ధార్థ్ ప్రభాస్ ని అప్రోచ్ కావటం... ప్రభాస్ పాజిటీవ్ గా స్పందించటం జరిగిపోయింది. ప్రస్తున్న సిద్ధార్థ్ షారూఖ్ ఖాన్ తో 'పఠాన్' సినిమా చేస్తుండగా, ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ తమ తమ కమిట్మెంట్స్ పూర్తి చేసుకుని 'రాంబో' సినిమా ఆరంభిస్తారట. మరి ఈ విషయమై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.