ప్రభాస్ అక్కడ... చిరు ఇక్కడ..!!
ఈ ఏడాది ద్వితీయార్ధంలో రెండు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి ప్రభాస్ సాహో సినిమా కాగా, రెండో సినిమా మెగాస్టార్ సైరా సినిమా. ప్రభాస్ సాహో సినిమా ఆగష్టు 30 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది ఫస్ట్ ఇండియన్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా అందుకోలేకపోయింది. అయితే, బాలీవుడ్లో చేసిన ప్రమోషన్లు, టివి షో ప్రమోషన్స్ కారణంగా సినిమాకు కలిసి వచ్చింది. బాలీవుడ్ లో సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి.
అయితే టాలీవుడ్ లో ఈ రకమై ప్రమోషన్స్ కు దూరంగా ఉండటంతో సినిమా ఇక్కడ అనుకున్నంతగా హిట్ కాలేదు. అక్కగా, మెగాస్టార్ నటించిన సైరా అక్టోబర్ 2 న రిలీజ్ అయ్యింది. ఈ మూవీని తెలుగులో గ్రాండ్ గా ప్రమోషన్స్ చేశారు. బాలీవుడ్లో పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా బాలీవుడ్లో కలెక్షన్లు పడిపోగా.. తెలుగులో మాత్రం సినిమా ప్రమోషన్స్ కారణంగా మంచి వసూళ్లు సాధిస్తూ వచ్చింది. సినిమా రిలీజ్ తరువాత కూడా ప్రమోషన్స్ చేయడం సినిమాకు కలిసి వచ్చింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)