ప్రభాస్ ఇది నిజమా...?

ప్రభాస్ ఇది నిజమా...?

ప్రభాస్... ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగుతున్న పేరు.  ప్రభాస్ తో సినిమా చేయడానికి అనేకమంది దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.  ప్రస్తుతం సాహో, జాన్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ పాన్ ఇండియా హీరో... సాహో తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. సాహో సినిమా కోసం ప్రభాస్ స్వయంగా హిందీ డబ్బింగ్ చెప్పబోతున్నాడు.  

ఇదిలా ఉంటె, ప్రభాస్ కు సంబంధించిన ఓ న్యూస్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు న్యూస్ ఛానల్ ను పెడుతున్నారని, ప్రభాస్ చేతుల మీదుగా ఆ ఛానల్ లాంచ్ జరగబోతుందని వార్తలు వస్తున్నాయి.  ఇది నిజమో కాదో తెలియదుగాని న్యూస్ మాత్రం దావానంలా వ్యాపించింది.  దీనికి ప్రభాస్ మాత్రమే సమాధానం చెప్పగలరు.