ఆ గౌరవం ప్రభాస్ ఒక్కడికే దక్కిందా..?

ఆ గౌరవం ప్రభాస్ ఒక్కడికే దక్కిందా..?

బాహుబలి సినిమాతో ప్రభాస్ జాతీయ స్థాయిలో ఫెమస్ అయ్యాడు.  ప్రభాస్ తో  సినిమా చేయాలని, ప్రభాస్ తో ఫోటోలు దిగాలని చాలామంది కోరుకుంటున్నారు.  బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు.  ఇదిలా ఉంటె, ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబాని సంగీత్ వేడుక ఇటీవలే ముగిసింది. జోధ్ పూర్ ప్యాలెస్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.  ఈ సంగీత్ ఉత్సవంలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు.  సంగీత్ వేడుకకు హిల్లరీ క్లింటన్ కూడా హాజరైంది.  

ఈనెల 12 వ తేదీన ముంబైలో ఇషా అంబాని వివాహం జరుగుతున్నది.  బాలీవుడ్ కు చెందిన ప్రముఖులందరికి ఈ వివాహానికి  సంబంధించిన ఆహ్వానాలు  అందాయి. కాగా, టాలీవుడ్ నుంచి ఒకేఒక్కడికి ఆహ్వానం అందిందట.  అలా అంబానీ కుటుంబం నుంచి ఆహ్వానం అందుకున్న  ఏకైక వ్యక్తి ఎవరో కాదు.. డార్లింగ్ ప్రభాస్.  ప్రభాస్ ఒక్కరికే  ఈ ఆహ్వానం అందటం విశేషం.