షాకిస్తున్న ప్రభాస్ జాన్ సెట్స్..!!

షాకిస్తున్న ప్రభాస్ జాన్ సెట్స్..!!

ప్రభాస్ సాహో రిలీజ్ తరువాత డివైడ్ టాక్ ను సొంతం చేసుకొని వసూళ్ల పరంగా పర్వాలేదనిపించుకుంది.  ఇప్పటికే రూ. 400 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది సినిమా.  అయితే, సినిమాను లావిష్ గా నిమించినా అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది.  ఇప్పుడు సినిమా రిపేర్ గురించి మాట్లాడుకుంటే ఉపయోగం లేదు కాబట్టి హీరో ప్రభాస్ నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టారట.  

గోపి కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.  దీనికోసం దాదాపుగా రూ. 180 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట.  1960కాలం నాటి కథతో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో దాదాపు 25 రకాల సెట్స్ ను నిర్మించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ఈ సెట్స్ వేస్తున్నారు.  ప్రతి సెట్ కూడా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.  సాహోలో మాదిరిగా భారీ క్యాస్టింగ్ ను పెట్టకుండా తక్కువ క్యాస్టింగ్ తో సినిమాను చిత్రీకరిస్తున్నారట.  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.