కాలాన్ని వెనక్కి తిప్పేస్తూ.. ప్రభాస్ స్పీడ్ పెంచాడు..
బాహుబలి తరువాత సాహు సినిమాకు ఆస్థాయిలో హిట్ వస్తుందని అనుకున్నారు. కానీ, సాహో సినిమా పెద్దగా హిట్ కాలేదు. సాహో మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా బాలీవుడ్లో ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ స్థాయిలో సినిమా హిట్ అవుతుందని అసలు ఊహించలేదు. ప్లాప్ టాక్ వచ్చినా ఏకంగా రూ. 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడంతో షాక్ అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 70శాతం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. 1980వ దశకంనాటి కథతో సినిమా తెరకెక్కుతోంది. కొంతభాగం యూరప్ లో షూట్ చేశారు. తరువాత హైదరాబాద్ లో ప్రత్యేక సెట్స్ వేసి షూటింగ్ చేశారు. ఇప్పుడు ట్రైన్ సెట్ వేసి షూటింగ్ చేయబోతున్నారు. మరో పది రోజుల షూటింగ్ తో టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం. ఆ తరువాత యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో సాంగ్స్ షూట్ చేస్తారట.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)