ఆ సినిమా పూర్తయ్యాకే ప్రభాస్ పెళ్లి?

ఆ సినిమా పూర్తయ్యాకే ప్రభాస్ పెళ్లి?

ఫ్యాన్స్ అందరి నోళ్లలోనూ నానుతున్న ప్రభాస్ పెళ్లి విషయం.. త్వరలో కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్.. ఆ సినిమా పూర్తయ్యాక పెళ్లి విషయంలో క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. వాస్తవానికి బాహుబలి తరువాత అంతా ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. అయితే బాహుబలి ప్రాజెక్టు తరువాత మరో ఐదేళ్ల సమయాన్ని రాజమౌళి కోసం ఇచ్చానని గతంలో ప్రభాస్ డిక్లేర్ చేశారు. మీడియా కూడా ఆయన పెళ్లి వార్తలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆయన చిన్నాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి విషయంలో ఆసక్తిగానే ఉన్నారు. తాజాగా సాహో పూర్తయిన వెంటనే ప్రభాస్ పెళ్లి పీటలెక్కడం ఖాయమని కృష్ణంరాజు ఇటీవల చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేకున్నా కృష్ణంరాజు మాటల్ని బట్టి సాహో పూర్తయ్యాక త్వరలోనే ఉండే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.